![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'(Krishna Mukunda Murari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -444 లో.. మురారీ, కృష్ణ, భవానీ, ఆదర్శ్, రేవతి, ముకుంద, సంగీత, మధు, సుమలత అంతా హాల్లో ఉంటారు. అదేసమయంలో కృష్ణను మురారి ఆటపట్టిస్తాడు. కృష్ణ చుడీదార్‌లో అందంగా ఉంటుందని భవానీ.. లేదు అసలు బాగోదని మురారీ వాదించుకుంటు ఉంటారు. నీకు టేస్ట్ లేదు మురారీ.. నిజంగానే కృష్ణ చుడీదార్‌లో చందమామలా ఉంటుందని భవాని అంటుంది. నిజమే పెద్దమ్మా.. నాకు టేస్ట్ లేదు.. ఉండి ఉంటే ఈ తింగరిని పెళ్లే చేసుకునేవాడ్ని కాదని మురారి సరదాగా అంటాడు. ఇక చేతిలోని గరిటె పట్టుకుని ఆగండి ఏసీపీ సర్ ఎంత మాట అన్నారంటు మురారీని కృష్ణ పరుగులెత్తిస్తుంది. అది చూసి ఆదర్శ్, మీరా రగిలిపోతారు. నిజంగానే మురారీ అన్న మాట నిజమే.. అందుకే ఆ కృష్ణను దూరం చేసి నీ జీవితంలోకి నేను వస్తాను మురారీ అని ముకుంద తన మనసులో అనుకుంటుంది.
ఇక కృష్ణ, మురారీలని ఒక దగ్గర నిల్చోమని భవాని చెప్తుంది. ఇప్పటిదాకా మీరు అందరికోసం ఆలోచించడం చాలు.. మీరు మాత్రం ఇక నుంచి మీకోసం మీరు ఆలోచించుకోండి. మీరు ఇక నుంచి నిజమైన భార్యభర్తలుగా మలగండి. శోభనానికి ముహూర్తాలు అచ్చిరావడం లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని భవాని చెప్తుంది. అది విని ముకుంద తనలో తాను రగిలిపోతుంది. బయటకు మాత్రం మురారి దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్తుంది. అది కూడా మురారి చేతిలో చేయి వేసి మరీ చెప్తుంది. అది కృష్ణ చూస్తుంది. దాంతో ముకుంద వెళ్ళిపోతుంది. ఏంటి చేతిలో చేయి వేసి మాట్లాడుతుందని మురారిని కృష్ణ అడుగగా.. మనకి కంగ్రాట్స్ చెప్పిందని మురారి చెప్తాడు. మరోవైపు సంగీత, రజినీలని తీసుకొని ముకుంద తన గదికి వెళ్తుంది.
ఇక ముకుంద అసలు నిజం రజినీతో చెప్పేస్తుంది. ఈ రాత్రి నుండి వారిద్దరి శోభనం జరగకుండా మీరే చూసుకోవాలి.. అప్పుడే సంగీత, అదర్శ్ ల పెళ్ళి నేను చేస్తానని రజినికి ముకుంద మాటిస్తుంది. దాంతో రజినీ సరేనంటుంది. " ప్లాన్ ఏ అయిపోయింది. ఈ రజినీ పూర్తి చేస్తుంది. ప్లాన్ బీ గురించి ఆలోచించాలి" అని ముకుంద అనుకుంటుంది. మరోవైపు రాత్రి అయ్యేసరికి.. కృష్ణ అందంగా రెడీ అయ్యి.. పాలగ్లాసుతో మురారి ఉన్న గదిలోకి వెళ్తుంది. అప్పటికే మురారీ మురిసిపోతూ సంబరంగా ఉంటాడు. భార్య అలా రెడీ అయ్యి రావడంతో పొంగిపోతాడు. కాసేపటికి ఇద్దరు అలా రొమాంటిక్‌గా, కొంటెగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |